భవన నిర్మాణ కార్మికులు కూడా వినియోగదారులే..
వినియోగదారుల చేతిలో బ్రహ్మాస్త్రం: తూ.గో.జిల్లా కన్సూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జిన్నూరి సత్య సాయిబాబా

భవన నిర్మాణ కార్మికులు కూడా వినియోగదారులేనని సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పు చెప్పిందని తూర్పుగోదావరి జిల్లా కన్సూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జిన్నూరి సత్యసాయిబాబా వెల్లడించారు.. రాజస్థాన్ భవన నిర్మాణ కార్మికుల విషయం లో భవన నిర్మాణ కార్మికుల బోర్డు సభ్యత్వం తీసుకున్న కార్మికుల కు చట్ట ప్రకారం సౌకర్యాలు కలిగించడంలో వేయడంతో సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీ ఈ మేరకు 2020 మార్చి 17న తీర్పు చెప్పారు. ఈ తీర్పు అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
కన్సూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ తూర్పుగోదావరి జిల్లా 2020 జులై 20 నుంచి అమలులోకి వచ్చిందని ఈ చట్టం వినియోగదారుల చేతిలో బ్రహ్మాస్త్రమని తూర్పుగోదావరి జిల్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయిబాబా పేర్కొన్నారు. ఈ చట్టం గురించి సాయిబాబా మీడియాకు వివరించారు. గురువారం జిల్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం వలన వినియోగదారుడు మరింత బలవంతుడవుతాడన్నారు. వినియోగదారుల రక్షణ మండలులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాలలో అనేక నిబంధనలు ఈ చట్టంలో పొందుపరిచినట్లు సాయిబాబా వివరించారు.
ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుందని, ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయటానికి పనిచేస్తుందని చెప్పారు. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్టు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా దర్యాప్తు జరిపి ఆ తయారీదారులు, లేదా అమ్మకం దారులు లేదా ప్రకటనల ప్రచురణ.ప్రసార కర్తలమీద జరిమానాలు విధిస్తుందన్నారు. ఈ-కామర్స్ వేదికలు అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవటానికి కూడా చట్టంలో నిబంధనలున్నాయని పాశ్వాన్ చెప్పారు. ఈ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు.కేంద్ర వినియోగదారు మండలి నిబంధనల ప్రకారం ఆ మండలి ఏర్పాటవుతుందని, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారపంపిణీ శాఖామంత్రి చైర్మన్ గాని, ఆ శాఖ సహాయమంత్రి వైస్ చైర్మన్ గాను, మరో 34 మంది వివిధ రంగాలకు చెందినవారు సభ్యులుగాను ఈ మడలి ఏర్పాటవుతుంది. ఈ మండలి పదవీకాలం మూడేళ్ళుంటుంది. ఒక్కో ప్రాంతంలోని రెండు రాష్ట్రాలకు చెందిన ఆహార మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ, తూర్పు ప్రాంతాలతోబాటు ఈశాన్య రాష్ట్రాలనుంచి ప్రాతినిధ్యం ఉంటుంది.
ఇప్పటిదాకా అమలులో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం (1986) ప్రకారం న్యాయవిధానం ఒకే చోట కేంద్రీకృతమై ఉండేదని, దీనివలన ఎక్కువ సమయం పట్టేదని సాయిబాబా వివరించారు. అనేక సవరణల అనంతరం ఇప్పుడీ కొత్తం చట్టం రూపొందిందన్నారు. సంప్రదాయ అమ్మకం దారులతోబాటు కొత్తగా వచ్చిన ఈ-కామర్స్ వేదికలనుంచి కూడా ఇప్పుడు వినియోగదారులకు రక్షణ కలుగుతుందన్నారు. దేశంలో వినియోగదారుల చేతిలో ఇప్పుడొక బ్రహ్మాస్తం ఉన్నట్టేనని జిల్లా కన్సూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాయిబాబా అభివర్ణించారు. ఈ సమావేశానికి కోనసీమ వినియోగదారుల సమాఖ్య అరిగెల బలరామమూర్తి అధ్యక్షత వహించారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు నాగా బత్తుల శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ వినియోగదారుల సంఘం అధ్యక్షులు జి వి ఎల్ ఎన్ శర్మ, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ఈ ఆర్ సుబ్రహ్మణ్యం, అర్బన్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీమతి వెంకటేశ్వరి, డివిజనల్ సరఫరా అధికారి ఆనందబాబు, డ్రగ్ ఇన్స్పెక్టర్ భూపేష్, వినియోగదారుల సమాచారం ఎడిటర్ హెచ్ ఎస్ రామకృష్ణ, జిల్లా ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాసనగేష్, పెద్దాపురం వినియోగదారుల సంఘం ప్రతినిధి సూర్యనారాయణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గోకరకొండ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019
మార్కెట్‌లో వినియోగదారులు అనేక విధాలుగా మోసపోతున్నారు. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా దగా పడక తప్పడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిపై అవగాహన లేక, మోసపోయినపుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. ఇది వ్యాపారులకు కలిసివస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019 అమలులోకి వచ్చింది. ఇది వినియోగదారులకు ఒక రక్షణ కవచం లాంటిది. ప్రతీ ఒక్కరు ఈ కొత్త చట్టం గురించి అవగాహన పెంపొందించుకొని వ్యాపారుల మోసాల నుంచి తమను తాము కాపాడుకోవాలి. తమ హక్కులను రక్షించుకోవాలి.
ఇది వరకు వినియోగదారుడు మార్కెట్‌కు వెళ్ళి వస్తువులను కొనుగోలు చేసుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అంతా ఆన్‌లైన్ మార్కెట్. దీంట్లో వినియోగదారుడు మరింత మోసపోతున్నాడు. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, ఆశించిన మేర నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా అడిగే పరిస్థితులు అంతగా లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం-2019 పలు విధాలుగా కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తున్నది. వినియోగదారుల చట్టం -1986 స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఇది. వినియోదారుల హక్కుల ఉల్లంఘనలపై భారీ జరిమానాలను విధించే వెసులుబాటు ఇందులో ఎక్కువగా ఉంది. ఇది అన్ని స్థాయిల్లోనూ జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు అంతటా వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది. వినియోగదారులకు రక్షణ నష్టం జరిగినప్పుడు జవాబుదారులను, కారకులను జరిమానాతోనే సరిపెట్టకుండా కఠిన శిక్షలు, జైలుకు పంపటానికి కూడా వెనుకాడని విధంగా కొత్తచట్టం వినియోగదారులకు రక్షణగా ఉంటుంది. వస్తు కొనుగోలు ఏ రూపంలో చేసినా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర విధానాల ద్వారా కొనుగోలు చేసినా వినియోగదారుడిగానే పరిగణిస్తూ అతనికి ఈ కొత్త చట్టంలో రక్షణ కల్పించారు.
కొత్తచట్టం:
- కొత్త వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో మరిన్ని హక్కులను పొందుపరిచారు. అవేంటో చూద్దాం..
- వినియోగదారుడు మోసపోయినపుడు ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేసినాసరే ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు.
- వస్తువను కొనుగోలు చేసిన తర్వాత తనకు తగురీతిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు అతడికి నష్టపరిహారం పొందే హక్కు కొత్త చట్టంలో కల్పించారు.
- అక్రమ వ్యాపార పద్ధతుల ద్వారా వినియోగదారులకు నష్టం జరిగినప్పుడు కొనుగోలుదారులను ఒక సామాజిక సమూహంగా పరిగణించి వారి రక్షణకు కొత్త చట్టం అండగా నిలుస్తుంది.
- వినియోగదారులు తమ ఫిర్యాదులను జిల్లా స్థాయిలో వినియోగదారుల కోర్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
- ఒకవేళ కేసును తిరస్కరిస్తే కారణమేంటో తెలుసుకునే హక్కును ఈ చట్టంలో కల్పించారు.
మరెన్నో..
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019లో మరో ఏడు ముఖ్య రక్షణలను కల్పించారు. అక్రమ పద్ధతులు, లావాదేవీలను నిరోధించడం, ఆన్‌లైన్ అమ్మకాలు, టెలీషాపింగ్, మల్టీమార్కెటింగ్ వంటివి ఈ చట్టం పరిధిలోకి తేవడం, వస్తువులు, సేవలు, నిర్మాణాలు, ఇండ్ల నిర్మాణాలు, ప్లాట్ల అమ్మకాల వంటివి కూడా చట్టం పరిధిలోకి తీసుకురావడం, వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం కూడా ఈ చట్టం ద్వారా ఏర్పడడం వీటిలో ఉన్నాయి.
ఎలా ఫిర్యాదు చేయాలి..
ఆహార కల్తీలకు సంబంధించిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి, లేదా ఫుడ్ ఇన్‌స్పెక్టరుకు ఫిర్యాదు చేసి పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ఫుడ్ అండ్ హెల్త్ అథారిటీ నారాయణగూడ, హైదరాబాదుకు పంపాల్సి ఉంటుంది. అగ్‌మార్క్ వస్తువులపై ఫిర్యాదులను సీనియర్ మార్కెటింగ్‌ఆఫీసర్ ఇన్‌చార్జి, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్, కొత్తపేట మెయిన్‌రోడ్, గుంటూరుకు పంపించాలి. తూనికలు కొలతలపై ఫిర్యాదులను ఇన్‌స్పెక్టర్, తూనికల శాఖ కార్యాలయం, కాకినాడ, లేదా కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ, అమరావతికు పంపించాలి.
బ్యాంకులపై ఫిర్యాదులను ఆల్ ఇండియా బ్యాంకు డిపాజిటర్స్ అసోసియేషన్, వీరమల్ మాన్షన్- 235, డిఎస్ రోడ్, ముంబాయి, 400001 చిరునామాకు పంపించాలి. రైల్వేలపై ఫిర్యాదులను జనరల్ మేనేజరు, కాంప్లైంట్ సెల్, సౌత్ సెంట్రల్ రైల్వే సికిందరాబాదు,- 370కి పంపించాలి. చౌక డిపోలపై ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారి, కలెక్టరేట్ కాకినాడ లేదా డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లయీస్, సివిల్ సప్లయీస్ భవన్ విజయవాడ కు ఫిర్యాదు చేయాలి. అశ్లీల ప్రకటనలపై ఫిర్యాదులను అడ్వర్టయిజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బజాజ్ భవన్, సెకండ్ ఫ్లోర్, నారిమన్ పాయింట్ ముంబాయి- 400021కి ఫిర్యాదు చేయాలి. రేషన్ కార్డులపై ఫిర్యాదులను స్థానిక తహసీల్దారుకు ఫిర్యాదు చేయాలి.
కొత్తచట్టంతో పలు లాభాలు
వినియోగదారుల హక్కుల పరిరక్షణ-2019లో చాలా సంస్కరణలు చేశారు. ఈ చట్టం ద్వారా ఇక నుంచి జిల్లా వినియోగదారుల ఫోరంను జిల్లా కమిషన్‌గా పిలుస్తారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్, జాయతీ స్థాయిలో జాతీయ కమిషన్‌గా పిలుస్తారు. జిల్లా ఫోరం పరిధిని, నష్టపరిహారం గతంలో రూ.20 లక్షలు ఉండగా కొత్త చట్టంలో ఆ మొత్తాన్ని రూ.1 కోటి వరకు పెంచారు. రాష్ట్ర స్థాయిలో రూ.20 కోట్లు, జాతీయ స్థాయిలో ఆపైన పెంచారు. వ్యాపార ప్రకటనలలో నటించే సినిమా యాక్టర్లను కూడా బాధ్యుతలను చేయవచ్చు. ఆర్బిట్రేషన్, మధ్యంతర సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించారు. సెంట్రల్ కన్సూమర్ అథారిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలను ఇచ్చింది.
చైతన్యంతోనే అక్రమాలకు అడ్డుకట్ట..
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ కొనుగోలుదారులు విధిగా బిల్లు తీసుకోవాలి. గ్యారెంటీ, వారంటీ బిల్లులను భద్రపరచుకోవాలి. ఐఎ్‌సఐ, అగ్‌మార్కు, హాల్‌మార్కు వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. డిస్కౌంట్లు, ఆకర్శణీయమైన ప్రకటనలతో మోసపోవద్దు. వస్తువు తయారీ తేదీ, గడువు తేదీ, ధర తదితర వివరాలను సరిచూసుకున్న తర్వాతే వస్తువులను కొనుగోలు చేయాలి. మోసపోయినపుడు వెంటనే వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా సరైన సమాచారం తెలుసుకొని వినియోగదారుల కేంద్రంలో ఫిర్యాదుచేసి నష్టపరిహారం పొందవచ్చు. నామమాత్రపు ఫీజుతో ఫోరం ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది.
-టి.వి.గోవిందరావు