భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కిందకు రాలేదు.ప్రధానంగా ఐటీ, ఫార్మా,మెటల్ స్టాక్ జంప్ చేశాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ 3 శాతం మేర లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. బ్యాంక్ నిఫ్టీ 29,817 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 505.72 పాయింట్లు అంటే 1.15శాతం లాభపడి 44,655.44 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు అంటే 1.08 శాతం ఎగిసి 13,109 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1869 షేర్లు లాభాల్లో,974 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు.నిఫ్టీ 50 స్టాక్స్ 1.08 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.59 శాతం లభపడ్డాయి.