భూ రిజిస్ట్రేషన్లలో విప్ల‌వాత్మ‌క మార్పులు

హైదరాబాద్‌ : ‌తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన బిల్లును బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణిస్తామన్నారు. ఇకపై సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను తహశీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులు డిజిటల్ స్టోరేజ్‌లో ఉంటాయని తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ఇకనుంచి తహసీల్దార్‌ చూస్తారన్నారు. తన ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, దయ కలిగినప్పుడు చేస్తా అంటే నడవదన్నారు. ప్రజల విజ్ఞప్తిపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఓ వ్యవసాయ భూమిని ఒక వ్యక్తిని అమ్మిండు. మరో వ్యక్తి కొన్నడు. ఇద్దరికి పాస్‌బుక్‌లు ఉన్నాయి. మాటా ముచ్చట, బేరం మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి జాయింట్‌ రిజిస్ట్రార్‌ కం ఎమ్మార్వో వద్దకు వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ కావాలని అడుగుతరు. ఇది స్వయంగా కలిసి అడుగొచ్చు లేదా వెబ్‌సైట్‌లో కూడా అడుగొచ్చన్నారు.
వెంటనే ఎమ్మార్వో విధిగా స్లాట్‌ అలాట్‌ చేయాలి. అలాట్‌ చేసింది విధిగా వెబ్‌సైట్‌లో పెట్టాలి. పలాన వ్యక్తులు వస్తున్నరు. వారికి ఈ సమయంలో స్లాట్‌ అలాట్‌ అయి ఉన్నదని. అదేవిధంగా లాగ్‌ రిజిస్టర్‌లో కూడా నమోదు చేయాలి. ప్రతీ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో, ప్రతీ ఎమ్మార్వో ఆఫీసులో కూడా లాగ్‌ బుక్స్‌ ఉంటయి. అదేవిధంగా హార్డ్‌ కాపీ కూడా మెయింటెన్‌ అవుతదన్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ అవసరం లేదనుకునేవారు వారే సొంతంగా రాసుకోవచ్చు. అందుకు టెంప్లేట్స్‌(నమూనా పత్రాలు) ఎమ్మార్వో, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రాసుకోలేము అనుకునేవారి గవర్నమెంట్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ను సంప్రదించి రాతకోతలు పూర్తిచేసుకోవాలి. కేటాయించిన స్లాట్‌ టైంలో భూమి అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి ఇరువురు పాస్‌బుక్‌లు తీసుకుని ఆఫీసుకు పోతరు. సమర్పించి పత్రాలకు ఎలిజిబులిటి ఉందా లేదా అని చెక్‌ చేస్తాడు. అర్హత ఉంది అంటే రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుని (చాలానా రూపంలో లేదా డ్రాఫ్ట్‌ రూపంలో లేదా క్యాష్‌ రూపంలో) వెంటనే రిజిస్ట్రేషన్‌ చేస్తరు.
అప్పుడే, అక్కడే అమ్మిన వ్యక్తి పాస్‌బుక్‌లోంచి ఎంత భూమి అయితే అమ్మిండో దాన్ని డెలిట్‌ చేసి కొన్న వ్యక్తి పాస్‌బుక్‌లోకి ఎంటర్‌ చేస్తారు. మ్యూటేషన్‌ పవర్‌ కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు ఇస్తున్న నేపథ్యంలో మ్యూటేషన్‌ కూడా వెంటనే అవుతది. మ్యూటేషన్‌ చేయడమే కాకుండా అక్కడే ఐటీ టేబుల్‌ రెడీగా ఉంటది. వాళ్లకు డాక్యుమెంట్‌ ఇవ్వాలి. ఒక్కటే నిమిషంలో ఐటీ టేబుల్‌లో ఉండే వ్యక్తి అప్రూవ్‌ చేసి కాపీ కూడా డౌన్‌లోడ్‌ చేసి ఇస్తడు. మ్యూటేషన్‌ అయిన ఐదో నిమిషం లోపల భూ మార్పిడి జరిగిందని యావత్‌ ప్రపంచానికి తెలిసిపోతది. పలనా వారీ భూమి పలనా వాళ్లు కొన్నరని వెబ్‌సైట్‌లో వచ్చేస్తుంది. డాక్యుమెంట్‌, పాస్‌బుక్‌, ధరణి కాపీ భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి ఇస్తే అమ్మిన వ్యక్తికి పాస్‌బుక్‌తో పాటు ధరణి కాపీని అందజేస్తారన్నారు. రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, అప్‌డేషన్‌, ఎక్స్‌ట్రాక్ట్‌ కాపీ కూడా వెంటనే అక్కడికక్కడే వస్తుందని సీఎం పేర్కొన్నారు.

కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు…

  •  ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. పూర్తి పారదర్శకంగా ఉంటుంది

  •  పోర్టల్‌ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ లాండ్‌ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి

  •  తెలంగాణ రాష్ట్ర భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుంది.

  • ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు

  •  కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు

  •  ఏ రకమైన రిజిస్ట్రేషన్‌ కోసమైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి

  •  1971 యాక్ట్‌ రద్దుతో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్‌, కేసులు ట్రిబ్యునల్‌కు

  •  విచారణ తర్వాత ట్రిబ్యునల్‌ ఉత్తర్వులే ఫైనల్‌.

  •  కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు

  •  రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యూటేషన్‌

  •  మ్యూటేషన్‌ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగిస్తం

  •  మ్యూటేషన్‌ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్‌ కావాలి

  •  రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌బుక్‌, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు

  •  ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన

  •  పాస్‌ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసిల్దార్లదే

  •  వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే బదిలీ చేయాలి

  •  రికార్డు పూర్తిచేసి కొన్నవారికి బదిలీ చేయాలి

  •  తప్పుచేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్‌ క్రిమినల్‌ చర్యలు, తిరిగి భూములు స్వాధీనం

  •  రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై దావా చేయకూడదు

  •  డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు

  •  రుణాల మంజూరుకు పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు

  •  రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు

  •  అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు

  •  వీఆర్‌వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ

  •  వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం

  •  జాగీరు భూముల్ని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్టర్‌ చేయాలి

  •  కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా గుర్తింపు

  •  ఇకపై సబ్‌ రిజ%B

Comments are closed.