మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్: తెలంగాణ‌ మ‌హిళా, శిశు సంక్షేమ‌, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ క‌రోనా బారిన ప‌డ్డారు. సోమ‌వారం ఉద‌యం ఆమెకు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో వైద్యుల సూచ‌న మేర‌కు ఆమె హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ్వ‌రంతో గ‌త నాలుగు రోజుల నుంచి బాధ‌ప‌డుతున్న మంత్రికి ఇవాళ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.