మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్: 13మంది నక్సల్స్ హతం

గడ్చిరోలి (CLiC2NEWS) : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పైడి ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఈ అడవుల్లోని కాసన్సూర్ దళానికి చెందిన నక్సల్స్ పొగాకు ఒప్పందం గురించి సమీప గ్రామ ప్రజలతో మీటింగ్ ఏర్పాట చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో గడ్చిరోలి జిల్లా కొట్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీ-60 బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు ఎటపల్లి అటవీ ప్రాంతంలో మాటు వేశాయి.
ఇవాళ ఉదయ గ్రామ ప్రజలను కలిసేందుకు నక్సల్ వచ్చారు. కమాండోలను చూసిన కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 13మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఆపరేషన్ విజయవంతమైందని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గడ్చిరోలి డిఐజి సందీప్ పాటిల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.