మహారాష్ట్రలో కొత్తగా 14,317 కరోనా కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా రాష్ట్రంలో 14,317 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కు చేరింది. అలాగే తాజాగా రాష్ట్రంలో 57 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 52,667కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 7,193 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,070 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.