TS: మున్సిపాలిటీల్లో తాగునీటి నిర్మాణాలకు రూ. 164కోట్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మంచినీటి మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం రూ.164కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి తుర్కయాంజల్ మున్సిపాలిటి అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుర్కయాంజల్, పెద్ద అంబర్‌పేట, ఆదిబట్ల మున్సిపాలిటీలలో తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం, కాలనీలలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.164కోట్లు మంజూరు చేసిందని తెలియజేశారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు అనుగుణంగా రానున్నరోజులలో తాగునీటి అవసరాలను తీర్చేవిధంగా మంజూరైన నిధులు వినియోగించాలన్నారు. వచ్చే సంవత్సరం .జూన్ వరకు ఈపనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.