మున్సిపాలిటీ కార్మికులకు 11వ PRCలో కనీస వేతనాన్ని అమలు చేయాలి..

కె.రాజనర్సు మున్సిపల్ జిల్లా అధ్యక్షులు

కామారెడ్డి: జిల్లా మున్సిపాలిటీ వద్ద తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (CITU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధ‌వారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లానాయకులు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికులు పట్ల వివక్షత, నిర్లక్ష్యం వైఖరి చూపుతోందని మండిపడ్డారు. 8వ PRC నుండి 10PRC వరకు ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ వేతనాన్ని మున్సిపాలిటీ కార్మికులకు కనిసవేతనాన్ని ఉమ్మడి రాష్టం ఉన్నప్పటి నుండి అమలు చేశారు. ఇప్పుడు 11వ PRC లో మున్సిపాలిటీ కార్మికులకు వర్తింపచేయక పోవడన్నీ తీవ్రంగా ఖండించారు.md. మహిబూబ్ అలీ జిల్లా కార్యదర్శి మున్సిపల్ సీఐటీయూ మాట్లాడుతూ కరోన సమయంలో కూడా ప్రాణాలకు తెగించి కార్మికులు పనిచేశారని అన్నారు. సందర్భాలు వచ్చినప్పుడు మున్సిపాలిటీ కార్మికుల కళ్ళు మొక్కడం / సన్మానాలు చేయడం కాదని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 11పిఆర్సీలో కనీస వేతనం కేటగిరీల బట్టి ప్రకటించాలని అన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం నిర్ణయించాలని అన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పును గౌరవించి మున్సిపల్, జిపి కార్మికుల పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
11 PRC లోనే మునిసిపల్ కార్మికులకు వర్తింప చేయకుండా తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. అవరమైతే కార్మికులంతా వేతనాల పెంపు కోసం సమ్మెకు సిద్ధం అవుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్(CITU) నాయకులు ప్రవీణ్.వడ్లుర్ నర్సింలు.ప్రభాకర్.సంతోష్. గంగాధర్ రాజేందర్.శివరాజవ్వ. దీవెన. భాగ్య. కళావతి. రాజన్న. కృష్ణ. t. రాజు.జనార్దన్. అబ్బాస్. ఈ దర్నకు ఏఐటీయూసీమున్సిపల్ అధ్యక్షలు లక్ష్మణ్ *మద్దతు తెలిపారు వారు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి 11prc మున్సిపాలిటీ కార్మికులకు వర్తిపకపోతే ఐక్య పోరాటాలు చేస్తాము అని వారు డిమాండ్ చేసినారు ఈ ధర్నాలోసుమారు300 మంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.