మృగశిర కార్తె అంటే ఏమిటి?

ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8 వ తేదీ మంగ‌ళ‌వారం నుండి ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుండి రైతులకు సమస్త ప్రాణకోటికి మృగశిర కార్తి వచ్చినందంటే సకల ప్రజలకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో ఉల్లాసంగా వుంటారు. ఎండాకాలంలో ఎండ దెబ్బకు శారీరకంగా, మానసికంగా అల్లకల్లోలంగా మారి నానా ఇబ్బందులు పడిపోయినారు. కానీ మృగశిర తో సకల ప్రాణకోటి జీవరాసులకు ఈ మృగ‌శిరలో పడే వర్షం చాలా రిలాక్స్ ని ఇస్తుంది. ఒకేసారి వేడి నుండి చల్లగా ప్రకృతి మారగానే శరీరం యొక్క వేడి తాపం తగ్గి చర్మం సున్నితంగా కనపడుతుంది.

ఈ మృగశిరకార్తె రాగానే నైరుతి రుతుపవనాలు కూడా మన భారతదేశంలోకి ప్రవేసిస్తాయి. సూర్యుని వేడికి భూమండలం నిప్పుల సెగతో ఉన్న ప్రదేశం చల్లగా మారుతుంది. ప్రకృతి పచ్చగా కనపడుతుంది. ప్రతి జీవరాశి ముఖంలో కళ వస్తుంది. ఆకాశంలో మేఘాలు నల్లగా వచ్చి ఉరుములతో,మెరుపులతో కుంభ వర్షం పడుతుంది.

వర్షం పడగానే రైతులు చేనులో అంతకు ముందు ఎరువు వేసి ఉంచిన దాని మీద దుక్కి దున్ని పంటలు వేయటానికి రైత‌న్న‌లు సిద్ధంగా వుంటారు.

మృగశిర కార్తె ఎలా ఏర్పడుతుంది. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేసిస్తాడో ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది.

అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది.

ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు, తదితర అంశాల ఆధారంగా చేసుకొని ఆ యేటి యొక్క వర్గాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

మృగశిర కార్తె మొదటిరోజు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మృగం, మిరుగు, మిర్లం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రజలు బెల్లం, ఇంగువ కలిపి తింటారు. బెల్లం శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. ప్రేవులకు బ‌లాన్నిస్తుంది, ఆరోగ్యాన్ని బెల్లం చాలా మంచిది. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వచ్చే వర్షాకాలంలో జబ్బులను కట్టడిని చేస్తుంది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో అనేక రకాల చేడు సూక్ష్మకిములు, క్రిమికిటకాల పునరుత్పత్తి అవుతాయి. మానవులలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. దానితో జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకు సంబంధించిన జబ్బులు, ఆస్తమా, సైనస్, వ్యాధులు వస్తాయి.

అలానే మృగశిర కార్తె తొలిరోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజలు నమ్ముతారు. చేపలలో ఎన్నో విషయాలు దాగి వున్నాయి. కాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీసీయం, జింక్, వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి. మానవునికి కావాల్సినంత అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసీన్, మిథియోనిన్, ఐసాల్యూసిస్, వంటి అమెనో ఆమ్లాలు, పుష్కలంగా ఇందులో ఉంటాయి. థయామిన్, రైబో ఫ్లెవిన్, నియాసిన్, పెరిడాక్ బయోటిన్, పేంటోతినిక్ ఆమ్లం, బి12 విటమిన్ ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు, ఆమ్లాలలో DHA, EPA వంటివి కంటి చూపుకు బాగా పనిచేస్తాయి. మేధా శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. చేపలలో ఉన్న కొవ్వు, కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్, శరీర రక్తపిడనం మంచి ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులు, ఆస్తమా,వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, వీరు చేపలు తింటే మంచిది.

హెచ్చరిక: చర్మ వ్యాధిగ్రస్థులు తినకపోవటం మంచిది.

చేపలు తిన్న తరువాత పాలు, పెరుగు, పాలతో తయారుచేసిన పదార్దాలు, ice క్రీమ్ తినరాదు. ఎందుకంటే చర్మవ్యాధులు వస్తాయి.

-వైద్య.షేక్.బహర్ అలీ

 

Leave A Reply

Your email address will not be published.