మహిళపై యాసిడ్ దాడి

మెదక్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లో మహిళపై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు ఓ ప్రభుద్దుడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్లాదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.