యశోద ఆసుపత్రిలో చేరిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ యశోద ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ముందుజాగ్రత్తగానే మంత్రి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
కాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.
యశోద లో కాదు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకోండి….