రజినీ సంచలన ట్వీట్.. జనవరిలో రాజ‌కీయ అరంగేట్రం

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రంపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డింది. త‌మిళ‌నాట ప్ర‌జ‌లు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తలైవా రాక ఖ‌రారైంది.

రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఆయన… ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. రజనీ ట్వీట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

“ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయ‌మైన‌, కుల‌మ‌తాల‌కు అతీత‌మైన ఆధ్యాత్మిక రాజ‌కీయాల‌కు నాంది ప‌ల‌క‌డం నిశ్చ‌యం. అద్భుతాలు, ఆశ్చ‌ర్యాలు జ‌రుగుతాయి. మారుస్తాం. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్ప‌టికికీ జ‌ర‌గ‌దు“ అని ర‌జ‌నీ ట్విట్ట‌వ‌ర్‌లో పేర్కొన్నాడు.

 

Leave A Reply

Your email address will not be published.