రసాయన శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్

స్టాక్‌హోం : జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో విశేష కృషి చేసిన ఎమ్మాన్యుయెల్లె చార్పెంటీర్, జెనిఫర్ ఏ డౌడ్నా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. జీన్యువుల స‌వ‌ర‌ణ ‌(జీనోమ్ ఎడిటింగ్‌) కోసం ఓ కొత్త విధానాన్ని అభివృద్ధిప‌రిచిన ఎమ్మాన్యువ‌ల్ చార్‌పెంటైర్‌, జెన్నిఫ‌ర్ ఏ డౌనాల‌కు ఆ అవార్డు ద‌క్కింది. జ‌న్యువు టెక్నాల‌జీతో ఓ కొత్త ర‌క‌మైన, చాలా ప‌దునైన విధానాన్ని ఈ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు డెవ‌ల‌ప్ చేశారు. సీఆర్ఐఎస్‌పీఆర్‌-కేస్‌9 జ‌న‌టిక్ సీజ‌ర్ల‌ను ఈ ఇద్ద‌రూ అభివృద్ధిప‌రిచారు. ఈ విధానం ద్వారా.. ప‌రిశోధ‌కులు త‌మ టూల్స్‌తో జంతువులు, వృక్షాలు, సూక్ష్మ‌జీవుల్లో.. అత్యంత క‌చ్చిత‌త్వంతో డీఎన్ఏను మార్చ‌గ‌ల‌రు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం, 2020ని ప్రకటించింది. జీనోమ్ ఎడిటింగ్‌లో వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
ఫ్రాన్స్‌లోని జువిసీ స‌ర్ ఓర్జ్‌లో 1968లో ఎమ్మాన్యువ‌ల్ పుట్టారు. బెర్లిన్‌లోని మ్యాక్స్ ప్లాంక్ యునిట్‌లో ఆమె డైర‌క్ట‌ర్‌గా చేస్తున్నారు. మ‌రో శాస్త్ర‌వేత్త జెన్నిఫ‌ర్ అమెరికాలోని వాషింగ్ట‌న్‌లో 1964లో పుట్టారు. యూసీ బెర్క్‌లీలో ఆమె ప్రోఫెస‌ర్‌గా చేస్తున్నారు.
సీఆర్ఐఎస్‌పీఆర్‌-కేస్‌9 జ‌న‌టిక్ క‌త్తెర్లు.. క‌ణ‌జీవ శాస్త్రంలో పూర్తి విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. ప్లాంట్ బ్రీడింగ్‌లో ఈ విధానం వ‌ల్ల కొత్త అవ‌కాశాలు ఉత్ప‌న్నం అయ్యాయ‌ని చెప్పారు. క్యాన్స‌ర్ చికిత్స‌లోనూ నూత‌న విధానం డెవ‌ల‌ప్ అయ్యింద‌న్నారు. వంశ‌పారంప‌ర్యం వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల‌ను జ‌న‌టిక్ సీజ‌ర్ల‌తో న‌యం చేసే అవ‌కాశం ఉంద‌ని నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. స్ట్రెప్టోకోక‌స్ బ్యాక్టీరియం ఇమ్యూన్ వ్య‌వ‌స్థ‌ను అధ్య‌య‌నం చేసిన ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు.. జ‌న్యువుల‌ను వేరు చేసేందుకు ఓ కొత్త రక‌మైన ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది. ఈ విధానంతో లైఫ్ కోడ్‌నే మార్చివేయ‌వ‌చ్చు అని వెల్ల‌డించింది.

 

Leave A Reply

Your email address will not be published.