రాజన్న శివరాత్రి ఆదాయం రూ.63 లక్షలు

వేములవాడ: మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆదాయం ఒక్కరోజే రూ. 63,32,345 వచ్చింది. ఈ ఆదాయం 10 వ తేదీ బుధవారం రాత్రి 12 గంటల నుంచి గురువారం రాత్రి 12 గంటల వరకు మాత్రమేనని ఆలయ అధికారులు తెలిపారు. కాగా మొత్తం ఆదాయంలో కోడెమొక్కు ద్వారా రూ.20లక్షల 46 వేలు, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.29 లక్షలు, పులిహోర అమ్మకాల ద్వారా రూ. 98 వేలు, శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.3.97 లక్షలు, వీఐపీల దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.4 లక్షల 55 వేలు, భీమేశ్వరాలయంలో ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.2 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.