రాజ‌కీయాల్లోకి వ‌స్తాను: రాశీఖ‌న్నా

హీరోయిన్‌ రాశీఖన్నా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసే ఓ విష‌యం చెప్పింది. తాజాగా రాశీఖ‌న్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానన్నారు రాశీ ఖన్నా. రాజ‌కీయం ఎలా చేయాలో నాకు తెలియ‌దు, కానీ ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేయాలో మాత్రం నాకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాల‌ని ఉండేది. కానీ న‌టిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది. కాగా తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ఇప్పుడు క్రమంగా తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.