రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఘనంగా వీడ్కోలు..

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్.. సిఐడి విభాగానకి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా వివిధ విభాగాల్లోని పోలీసు సిబ్బంది కమిషనర్‌పై పూలు చల్లుతూ.. ప్రత్యేక వాహనంలో ఆయన్ని ఊరేగించారు. వాహనానికి ఏర్పాటు చేసిన తాడును హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు లాగి సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. కమిషనరేట్‌లో తనకు సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు. తనకు రామగుండం కమిషనరేట్ చాలా గుర్తుండిపోతుందన్నారు.