రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లక్నో యూనివర్సిటి ప్రారంభమై నేటికి సరిగ్గా వందేండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్నో యూనివర్సిటీ వందేండ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును, రూ.100 నాణేన్ని ప్రధాని తన చేతుమీదుగా విడుదల చేశారు.
PM Narendra Modi releases special stamp and Rs 100 coin to commemorate the Centennial Foundation Day of the University of Lucknow. pic.twitter.com/tMYE10vbIo
— ANI (@ANI) November 25, 2020