రెండు బిల్లులు ఆమోదం

హైదరాబాద్: సర్కార్ ప్రవేశపెట్టన 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ 2 బిల్లులు సభలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు. ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేల వైద్యం కోసం 10 లక్షల వరకు సాయం అందేలా చట్ట సవరణ చేయాలనీ అలాగే పెన్షన్ ని కనీసం 30 నుండి 50 వేలకు పెంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక గరిష్ట పెన్షన్ 50 నుండి 70 వేలకు పెంచనున్నారు. ఇలా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 61 యేండ్ల వరకు వయో పరిమితి పెంచుతూ సర్కార్ బిల్ ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం అని హరీష్ రావు అన్నారు.