Corona: 2 మాస్కులు క‌చ్చితంగా వాడాలా?..

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టినుండి ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్టారు. ఆహార నియ‌మాలు, శుభ్ర‌త‌, వ్యాయామంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ లేకుండా బ‌య‌టికి రావ‌టంలేదు. అయితే ఈమాస్క ఎలా వాడాల‌నే విష‌యం లో కేంద్రప్ర‌భుత్వం ఈ మ‌ధ్య  కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

  • 2 మాస్క్ లు త‌ప్పకుండ వాడాలి. అయితే ఒకే రకమైనవి 2 మాస్క్‌లను ధరించకూడ‌దు.
  • రెండు మాస్క్‌లలో ఒకటి సర్జికల్‌ మాస్క్‌, మరొకటి క్లాత్ తో తయారుచేసిన మాస్క్ అయి ఉండాలి.
  • వ‌స్త్రంతో త‌యారుచేసిన దానిలో మూడు పొర‌లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.
  • ఒక రోజు వాడిన మాస్క్ ను మ‌రుస‌టి రోజు వాడ‌కూడ‌దు.
  • శ్వాస క్రియకు ఇబ్బంది కలిగించేలా మాస్క్‌ ఉండకూడదు.
  • క్లాత్ తో త‌యారు చేసిన‌ మాస్క్‌ను తరుచూ ఉతుకుతూ ఉండాలి.

డబుల్‌ మాస్క్‌ సామర్థ్యం ఏమిటంటే?
నాసికా రంద్రాల్లోకి వెళ్లే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను సాధారణ మాస్క్‌తో పోలిస్తే డబుల్‌ మాస్క్‌ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సరైన మాస్కు ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఈ వివరాలు ‘జామా’ ఇంటర్నల్‌ మెడిసన్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పాటించాల్సిన నియమాలు…

  • ఎన్ 95 మాస్క్‌,  లేదంటే ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే రెండు మాస్క్‌లలో ఒకటి సర్జికల్‌ మాస్క్‌, మరొకటి క్లాత్ తో తయారుచేసిన మాస్క్ అయి ఉండాలి.
  • ముక్కుకు ప‌ట్టి ఉండే మాస్కులను ధరించడం వల్ల అవి జారిపోయే సమస్య ఎదురుకాదు.
  • చెవుల‌కు త‌గిలించుకునే ఎలాస్టిక్ బ్యాండ్‌లు ఉన్న మాస్కులను ఎంచుకోవాలి.
  • త‌ల వెనుక క‌ట్టుకునే మాస్కులు ధరించేవారు, వాటి ముడులు ఊడిపోకుండా చూసుకోవాలి.
  • మాస్క్ ధ‌రించే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకోవాలి.
  • మాస్కును తొలగించేటప్పుడు చెవుల ద‌గ్గ‌ర ఉండే బ్యాండ్‌లను తీసివేయాలి. మాస్కును ముందువైపు నేరుగా తాకకూడదు.
  • తిరిగి వాడుకునే మాస్కులను శుభ్రంగా ఉతికి, సుర‌క్షిత‌మైన ప్ర‌దేశంలో ఆరబెట్టాలి.
  • మాస్కు తీసేసిన త‌ర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదా సబ్బుతో కడుక్కోవాలి.
  • వ్యాధిసోకిన వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం 30 నిమిషాలు మాస్క్‌ తీయ‌కూడ‌దు.
Leave A Reply

Your email address will not be published.