రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లు

న్యూఢిల్లీ : కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లు విడుదల అయ్యాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ‘కిసాన్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌’ పేరిట మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. అంతకుముందు కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా రూ.18 వేల కోట్లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ నిధి అందనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇస్తున్న విషయం తెలిసిందే. కిసాన్‌ నిధి స్కీమ్‌ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి రూ.2 వేలు జమ అవుతాయి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డును కూడా రైతులు వాడుకోవాలని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం మోడీ అరుణాచల్‌ప్రదేశ్‌ రైతులతో మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.