RITES: రైట్స్‌ లో అసిస్టెంట్ పోస్టులు

రైల్ ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ లిమిటెడ్

రైట్స్‌లో 18 అసిస్టెంట్ మేనేజ‌ర్ (సివిల్ ) పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. అభ్య‌ర్థులు బిటెక్ (సివిల్ ఇంజినీరింగ్) తో పాటు పని అనుభ‌వం ఉండాలి.
ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో పంపించాలి. ద‌రఖాస్తు చేసేందుకు చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 24. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.40వేల నుండి రూ. 1,40,000 వ‌ర‌కు వేత‌నం అందుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 32 ఏళ్ల‌కు మించ‌రాదు. మార్చి 9వ తేదీన ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ద‌ర‌ఖాస్తు రుసుం జ‌న‌ర‌ల్‌, ఒబిసి అభ్య‌ర్థుల‌కు రూ.600, ఎస్‌సి , ఎస్‌టి, పిడ‌బ్ల్యు బిడిల‌కు రూ.300 గా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థుల పూర్తి వివ‌రాల‌కు www.rites.com/Career వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.