`లాక్‌డౌన్` కాలాన్ని అక్ష‌రాస్య‌తాభివృద్ధికి వినియోగించాలి..

మంచిర్యాల (CLiC2NEWS): నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు లాక్ డౌన్ కాలంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ  మీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లల సహాయంతో రోజుకు ఒక గంట సేపు చదువు నేర్చుకోగలరని వయోజనవిద్య విభాగం మంచిర్యాల జిల్లా ఇంఛార్జి ఆజ్మీర పురుషోత్తం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షరాస్యత అభివృద్ధి కొరకు అందరు సహకరించాలని ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
చదువురాని వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది, చదువు కుంటే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. కోవిడ్ వాక్సిన్ విషయం లో చదువు రాని వారు రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఎంతో ఇబ్బంది కి గురయ్యారు, రైలు ప్రయాణం చేయడానికి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యే సరికి నిరక్షరాస్యులు ప్రయాణం చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ఇంకా ఎన్నో సమస్యలు వారు ఎదుర్కోవలసి వచ్చింది, మున్ముందు ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే కనీసం చదువడం రాయడం ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు, అందుకే ఏ పని చేయాలన్నా చదువు కుంటేనే సులభంగా ఉంటుంది.
కావున ఇళ్లల్లోనే ఉంటూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చదువు నేర్చుకొని మన జిల్లా ను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలపాలని కోరారు. ఈ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు చదువు నేర్పే ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేస్తాము అని విద్యార్థులకు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.