వ‌సంత‌ నవరాత్రి ల్లో లక్ష్మీదేవి పూజ

ఓం శ్రీ మహాలక్ష్మై నమః

ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

చైత్రశుద్ధ పాడ్యమి నాడు సాయంత్రం లక్ష్మీదేవి వద్ద, నేతి దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం ఒకసారి, లక్ష్మీ అష్టకం ఒకసారి చదివి, విదియనాడు రెండుసార్లు… ఆ విధంగా పెంచుకుంటూ పూర్ణిమి నాటికి 16 సార్లు లక్ష్మీ అష్టోత్తరం, 16 సార్లు లక్ష్మీ అష్టకం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఒకసారి చదివి, అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టిన యెడల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

  • 13-4-2021:- చైత్ర శుద్ధ పాడ్యమి: లక్ష్మీ అష్టోత్తరం ఒకసారి లక్ష్మీ అష్టకం ఒకసారి
  • 14 -4 -2021:- విదియ: లక్ష్మీ అష్టోత్తరం 2 సార్లు, లక్ష్మీ అష్టకం 2సార్లు
  • 15 -4 -2021:- తదియ: లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు, లక్ష్మీ అష్టకం 3 సార్లు
  • 16 -4 -2021:- చవితి: లక్ష్మీ అష్టోత్తర 4 సార్లు, లక్ష్మీ అష్టకం 4 సార్లు.
  • 17 -4 -2021:- పంచమి: లక్ష్మీ అష్టోత్తరం 5 సార్లు, లక్ష్మీ అష్టకం 5 సార్లు
  • 18 -4 -2021:- షష్ఠి: లక్ష్మీ అష్టోత్తరం 6 సార్లు, లక్ష్మీ అష్టకం 6 సార్లు
  • 19 -4 -2021:- సప్తమి: లక్ష్మీ అష్టోత్తరం 7 సార్లు, లక్ష్మీ అష్టకం 7 సార్లు
  • 20 -4 -2021:- అష్టమి: లక్ష్మీ అష్టోత్తరం 8 సార్లు, లక్ష్మీ అష్టకం 8 సార్లు
  • 21 -4 -2021:- నవమి: లక్ష్మీ అష్టోత్తరం 9 సార్లు, లక్ష్మీ అష్టకం 9 సార్లు
  • 22 -4 -2021:- దశమి: లక్ష్మీ అష్టోత్తరం 10 సార్లు, లక్ష్మీ అష్టకం 10 సార్లు
  • 23 -4 -2021:- ఏకాదశి: లక్ష్మీ అష్టోత్తరం 11 సార్లు, లక్ష్మీ అష్టకం 11 సార్లు
  • 24 -4 -2021:- ద్వాదశి: లక్ష్మీ అష్టోత్తరం 12 సార్లు, లక్ష్మీ అష్టకం 12 సార్లు.
  • 25 -4 -2021:- త్రయోదశి: లక్ష్మీ అష్టోత్తరం 13 సార్లు, లక్ష్మీ అష్టకం 13 సార్లు.
  • 26 -4 -2021:- చతుర్దశి: లక్ష్మీ అష్టోత్తరం 14 సార్లు, లక్ష్మీ అష్టకం 14 సార్లు.
  • 27 -4 -2021:- పూర్ణిమ: లక్ష్మీ అష్టోత్తరం 15+1=16 సార్లు, లక్ష్మీ అష్టకం 15+1=16 సార్లు, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఒకసారి.

లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించడం వల్ల, వసంత నవరాత్రుల పూజించిన ఫలితం ఉంటుంది. చంద్రుడు 16 కళలతో వృద్ధి చెందుతూ ఉంటాడు కనుక, చంద్రసహోదరి లక్ష్మీదేవి కాబట్టి, చంద్రుడి ననుసరించి ఇలా పెంచుకుంటూ పూజించడంవల్ల అష్టలక్ష్మీ అనుగ్రహం కలిగి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.

-ఎన్‌.రాజ్య‌ల‌క్షి

Leave A Reply

Your email address will not be published.