వాహనదారులకు గుడ్‌న్యూస్
వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబరు 31 పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబరు 31 వరకు పొడిగిస్తు సోమవారం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే వాహన పత్రాల చెల్లుబాటును కేంద్రం పొడిగించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ పంపించింది. లాక్‌డైన్ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకు ముందు మార్చి 30 నుంచి జూన్ 30కి పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబరు 30కి పొడిగించింది. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి వ్యాలిడిటీని పొడిగించింది కేంద్రం ప్రభుత్వం. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఈ ఏడాది ఆఖరు వరకు చెల్లుబాటు అవుతాయని మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.