విలువిద్య శిక్ష‌ణ‌కు ప్ర‌భాస్‌!

ముంబ‌యి.. ప్రభాస్‌ ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుస్‌ కోసం సిద్దమౌతున్నాడు. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్‌ భీకర పోరాటాలు చేయనున్నారు. రాముడి పాత్రలో బాణాలు సంధించనున్నాడు. ఇందుకోసం విలు విద్యపై దృష్టిపెట్టనున్నాడు. బహుబలి సినిమాలోనూ అలాంటి పోరాటాలు చేసిన ప్రభాస్‌ ఆదిపురుష్‌లో పూర్తి స్థాయిలో విలు విద్యను మ‌రింత‌గా ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభాస్‌ పూర్తిస్థాయిలో విలువిద్యలో శిక్షణ తీసుకోబోతున్నాడని దర్శకుడు ఓంరౌత్‌ చెప్పారు. బాలీవుడ్‌లో ఎందరో హీరోలు ఉండగా ప్రభాస్‌నే ఆదిపురుష్‌లో తీసుకోవడానికి కారణమేంటని అడగ్గా ప్రభాస్‌ మాత్రమే ఈ పాత్ర చేయగలడని ఓంరౌత్‌ అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు ఇలా ప్రభాస్‌లో ‘అదిపురుష్‌’ పాత్రను తాను చూశారని ఓంరౌత్‌ చెప్పారు.
ఇంకా.. ‘ఒక వేల ప్ర‌భాస్ కాక‌పోయి ఉంటే ఈ సినిమా చేసేవాడిని కాదు’ అని ద‌ర్శ‌కుడు తెలిపారు. ‘ఇది ప్ర‌భు రామ్ క‌థ.. ఇతిహాస‌గాథ‌లో ఒక పార్టు… దీన్ని నా ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నా.. చ‌రిత్ర కోణం నుంచే ఇప్ప‌టికే పూర్తి ప‌రిశోధ‌న చేశాం. అందుకు సంబంధించిన స్క్రిప్టు త‌యారు చేశాం. ఈ క‌థ ‘తానాజి’కి ముందు నుంచే నా మ‌న‌స్సులో ఉంది. ఆది ‘పురుష్ను’ 2021లో మొద‌లు పెట్టి 2022లో విడుద‌ల చేస్తాంస‌స అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.