విశాఖ‌లో కార్పొరేటర్‌ మృతి

విశాఖపట్నం : ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలుపొందిన సూర్యకుమారి ఆకస్మికంగా మృతి చెందింది. విశాఖ నగరంలోని 61వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందారు. విశాఖ పారిశ్రామికవాడలో నివాసముంటున్న ఆమె నివాసంతో ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సూర్యకుమారి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. హత్య జరిగి ఉంటుందా లేదా అనారోగ్యం కారణంగా మృతిచెందారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.