శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కాగా, ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌క‌పోవ‌డంతో అధికారులు, ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే గ్రహించడంతో పెను ప్రమాదం త‌ప్పిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.