శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకొన్న జస్టిస్ ఎన్వీ రమణ

శ్రీశైలం (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఆలయ ఈవో కేఎస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.