షేక్.బహర్ అలీ: అన్ని అంగాలను ఉత్తేజం చేసే సర్వాంగాసనం..

భారతీయ యోగాలో విశేషమైన వైద్య విధానాలున్నాయి.. ఒక్క మందు ఏ రూపంలో వాడకుండా కేవలం యోగ ఆసనాల ద్వారా కొన్ని రోగాలను నయం చేసే శక్తి యోగాకు ఉంది.. అందుకే విదేశీయులు యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యవంతంగా ఉంటున్నారు.. ఇప్పడిప్పుడే యువత యోగ ప్రాధాన్యత గుర్తిస్తున్నది.. యోగాలో వేసే ఒక్కో ఆసనంతో శరీరంలోని ఒక్కో భాగానికి కొత్త శక్తి ఇచ్చే అవకాశం ఉంది.. పురుషులలో పటుత్వాన్ని, మహిళలో రుతు సమస్యలను పరిష్కరించే యోగాసనం సర్వాంగాసనం.. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందా..
శరీరంలోని అన్ని అంగాలకు ఉపయోగపడే ఆసనం కాబట్టి దీనికి సర్వాంగసనం గా నామకరణం చేశారు. అన్ని అసనములు వేసిన తరువాత చివరగా వేసే అసనమే సర్వాంగాసనం అని కూడా అంటారు. మిగిలిన అసనాలలో ఒకటి లేదా రెండు అవయవాలు మాత్రమే ప్రభావిత మౌతాయి. ఈ సర్వాంగాసనంలో పేరుకు తగినట్లు అన్ని అంగాలు ప్రభావితమౌతాయి.
ఈ ఆసనం చివరగా చేయటం వలన శరీరంలో వేడి పుట్టి ఈ ఆసనం సులభంగా వెయ్యటానికి దాని లాభలను పూర్తిగా పొందటానికి వీలుకలుగుతుంది.
ఇది అభ్యసించటం వలన మస్తిష్కం , నాడిమండలం, వినాళగ్రంధులు, శ్వాసవ్యవస్థ, రక్తవ్యవస్థ, కంఠము, పొట్టతోపాటు, శారీరక సౌందర్యం కూడా వస్తుంది.
చేసే విధానం..
వెల్లకిల్లా అసనంపైన పడుకోవాలి. కాళ్ళు తిన్నగా ఉంచాలి. మడమలను పంజాలను కలిప ముందుకు సాగదీయాలి. రెండు చేతులు శరీరానికి దగ్గరగా చాచి ఉంచాలి. బిగింపు వదలకూడదు. అరి చేతులు భూమికి తగలాలి. తల నుండి కాలి వేళ్ళ వరకు శరిరమంతటిని తిన్నగా బిగువుగా ఉంచాలి. శ్వాసను నింపుకుంటూ పంజాలను మెల్ల మెల్లగా పైకి ఎత్తి 90 డిగ్రీల కోణంలో కాసేపు ఆపాలి. శ్వాసను వదులుతూ అర చేతులపైన బలాన్ని మోపుతూ కాళ్ళను తలవైపు భూమికి సమాంతరంగా తేవాలి. శ్వాసను స్వభావిక స్థితికి తెచ్చుకుంటూ ఈ స్థితిలో కాసేపు ఆగాలి. ఇప్పుడు కూడా పాదాల బిగుంపు అలానే ఉండాలి. మోకాళ్ళు తిన్నగా ఉండాలి. ఇప్పుడు రెండు చేతులతో నడుమును పట్టుకుంటూ కాళ్ళను ఆకాశంవైపు ఎత్తాలి. భుజాలపైన శరీరమంతా నిలబడేటట్లు నడుమును అరి చేతులతో బలంగా పట్టుకోవాలి. ఛాతిని గడ్డానికి దగ్గరగా తేవాలి. ఇప్పుడు కాలివేళ్ళను బిగువుగా సదలించి సాధ్యమైనంత సేపు ఉంచాలి. శ్వాస మాములుగా ఉండాలి.
యదా స్థితికి వస్తున్నపుడు వెన్నులో ఒక్కొక్క పూసమధింపుకుంటూ మెల్లమెల్లగా రావాలి. నడుము భాగమంతా భూమికి ఆనించి తరువాత బిగించి పంజాలను, మోకాళ్లను, అలాగానే ఎత్తి పెట్టి ఉంచాలి. నెమ్మదిిగా కాళ్ళను భూమిపైకి తెచ్చి మడమలను నెమ్మదిగా దింపి విశ్రాంతి తీసుకోవాలి.
ధ్యాన కేంద్రం విశుద్ధ చక్రము..
మిగతా భాగము రేపటి ఆర్టికల్లో చదవండి..
-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు