షేక్.బహర్ అలీ: శీతాకాలంలో ఇవి తింటే మీ ఆరోగ్యం మీ సొంతం!

శీతాకాలంలో మనం ఎలా ఉండాలి. ఏ ఆహార పదార్దాలు తినాలి. శరీరము వేడిగా ఉంచటానికి మరియు వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా చలికాలంలో వచ్చే జబ్బులు జలుబు, దగ్గు, జ్వరం, ఇతర జబ్బుల నుండి రక్షణ పొందుతూ శరీర పోషణ గురించి నాకు తెలిసిన కొన్ని నియమాలు చెపుతాను.
శీతాకాలంలో చలి నుండి కాపాడుకోవడానికి జనం వేడిగా వుండే దుస్తులు స్వేటర్స్ వేసుకుంటారు. అవి శరీరం పై నుండి చలి తగలకుండా కాపాడుతుంది. కానీ శరీరం లోపల వేడిగా ఉండటానికి కూడా చూసుకోవాలి. శరీరం కాలాన్ని బట్టి అంటే ఋతువులు అనుకూలంగా ఉష్ణోగ్రత మార్చుకునే శక్తి ఉండాలి. అప్పుడే చలి తగ్గుతుంది. చలి కాలం లో ఆహార పదార్దాలు జాగ్రతగా తీసుకుంటే శరీరం సంతులితంగా ఉండి చలికాలం వచ్చే జబ్బులు రావు.
చలికాలంలో అంతర్గత అవయవాలకు, బహిర్గతగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ఏమి తినాలి.
- చలికాలంలో వ్యాధులు రాకుండా ఉండేందుకు ఊపిరితిత్తులు చక్కగా పనిచేయడానికి చవన్ప్రశ్ లేహ్యం వాడాలి.
- తిప్పతీగ కషాయం తాగాలి.
- తులసి, మిరియాలు, అల్లం, అలాంటివి మంచివి.
- చలికాలంలో ఉదయం గోరువెచ్చని నీరులో తేనే నిమ్మరసం కలిపి తాగాలి.
- సైనస్, ఆస్తమా, జబ్బు ఉంటే బెల్లం, అల్లం, నిమ్మరసం టీ తాగాలి.
- పెదవులు పగిలితే నెయ్యి, లేదా, మీగడ, లేదా, గులాబీ జలం లేదా బొడ్డులో ఆవాల నూనె రెండు చుక్కలు వేసి నిదురపోవాలి. పెదవులు దొండ పండులాగా మారుతాయి.
- ఆయుర్వేద మందులు తులసి ఘనవటి, గిలివ్ ఘనవటి, వాడాలి. కుంకుమ పువ్వు పాలలో వేసుకొని తాగటం చేయాలి.
- చిన్న పిల్లలకు చావన్ ప్రాష్ లేహ్యం తినిపించాలి.
- చర్మం పొడి బారిపోతుంటే ఆయిల్ మర్దన చెయాలి. అవనూనే లేదా నువ్వుల నూనెతో శరీరానికి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చెయాలి. మార్కెట్లో దొరికే అలోవేరా క్రీమ్స్ వాడాలి.
(తప్పక చదవండి: చక్కని ఆరోగ్యానికి ఏ ఆహారం తీసుకోవాలి.. ఏమి తినకూడదు..)
- కాలికి పగుళ్లు వస్తే కుంకుడు కాయ రసంతో పగుళ్లను రాత్రి నిదురించే ముందు కడిగి దాని మీద కొబ్బరి నూనె కొన్ని రోజులు రాస్తే అవి తగ్గిపోతాయి. ముఖం కాంతిగా లేకపోతే బాదం నూనెతో మసాజ్ చేయండి. పెదవులకు కూడా రాయండి.
- ఇల్లు వేచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి.రాత్రి బొగ్గుల మీద సాంబ్రాణి,గుగ్గిలం వేసి ఇంట్లో దూపం పట్టాలి.
- చిన్న పిల్లలకు వెచ్చగా వుండేటట్లు స్వేటర్స్ తొడిగించాలి. కాళ్ళకు సాక్సులు తోడిగించాలి. ఇల్లు కింద నడిచేటప్పుడు చల్లగా ఉంటే చేప్పులు వేసుకొని తిరగాలి.
- చలికాలంలో చుండ్రు ఎక్కువగా వస్తుంది. దానిని నివారించడానికి ఆయుర్వేద ఆయిల్ వాడాలి. కుంకుడు కాయతో తల స్నానం చేయాలి.
- కేశాలు పెరగటానికి ఉసిరికాయ చూర్ణం తేనే కిలిపి తినాలి.
- ముఖం పొడి బారినట్లు అనిపిస్తే ముల్త్నా మట్టి, అలోవేరా, మరియు ఏదైనా ఆయిల్స్ ఆయుర్వేద షాపులో దొరికే వాటిని వాడాలి.
- వేరుసనగలు, బాదం, నువ్వులు, బెల్లం, ఎక్కువగా వాడాలి.
- ఆస్తమా, సైనస్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉంటే శ్వాస సరిగా పనిచేయకపోతే అణు తైలం రెండు చుక్కలు రెండు ముక్కులలో వేయండి.
మనకు చలికాలంలో మేలు చేసే ఆహారపదార్దాలు…
- జొన్నలు, జొన్నలు తింటే శరీరాన్ని ఎక్కువగా వేడిగా ఉంచుతుంది. జొన్న రొట్టె పిల్లలు, పెద్దలు, అందరూ చలికాలంలో తినాలి. దీనిలో అత్యధికంగా ప్రోటీన్స్ ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జొన్న లలో మెగ్నీషియం, కాల్షియమ్, మాంగనీసు, ట్రిప్ టో fane, ఫైబర్, విటమిన్ బి, అంటియాక్సిడెంట్ ఉంటాయి.
- ఆల్లము… ప్రతిరోజు చలికాలం అల్లం తీసుకుంటే చిన్న పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. ఆహారంలో కాని అల్లం టీ తాగటం కానీ, చేస్తే జీర్ణ క్రియ చక్కగా అవుతుంది.
- తేనే.. తేనే వేడిని కలిగిస్తుంది. చక్కని శక్తినిస్తుంది. తేనే ఎదో ఒక రూపంలో ఆహారంగా వాడితే జీర్ణ క్రియ మెరుగుబడుతుంది. ఇమ్మ్యూనిటి బూస్టర్గా పనిచేస్తుంది.
- డ్రై ఫ్రూట్.. బాదం, కిస్మిస్, అంజీరా, ఎందుఖార్జురా, ఇలాంటివి చాలా మంచిది. ఆవు నెయ్యి కూడా చాలా మంచిది.
- పండ్ల జ్యూస్, ice క్రీమ్స్, కూల్డ్రింక్, చల్లని నీరు తాగకూడదు.
- వేరుసనగలు తింటే మంచిది. వెంటనే పంచదార, లేదా బెల్లం తినాలి. నీరు తాగితే అజీర్తి అయ్యి, కడుపుబ్బరం అవుతుంది. ఇదే పనిగా పెట్టుకొని ప్రతి రోజు తింటే గ్యాస్ వచ్చి సైనస్ వస్తుంది.
- మనం తీసుకొనే ఆహారంలో కాయకూరలు తప్పకుండా వుండేల చూసుకోవాలి. కాయ కూరలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని స్థాయి ఆరోగ్యంగా వుంచుతాయి. మెంతికూర, పాలకూర, క్యారెట్, బీట్రూట్, బాటని తీసుకోవాలి.
- కఫము ఎక్కుగా ఉంటే ఉదయం పరిగడుపున ఒక లీటర్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి తాగి , వాంతులు చెయాలి. బీపీ ఉంటే నిమ్మరసం వేడి నీటిలో వేసి తాగాలి.
- అల్లం, తులసి, మిరియాలు, బెల్లం కలిపిన టీ తాగాలి. చలికాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వచ్చే జబ్బులకు జేబులకు చిల్లు బడుతాయి. తస్మాత్ జాగ్రత.
-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు