సమస్యలు బిహార్ కు పార్శిల్ చేస్తాం: రౌత్

ముంబై : బిహార్ ఎన్నికల ప్రచారంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.. ‘‘బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రచారాస్త్రాలు లేవంటే చెప్పండి… ముంబై నుంచి పార్శిల్ చేస్తాం’’ అంటూ ఎన్డీయే కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిహార్ ఎన్నికలు సుశాంత్ మరణం చుట్టే తిరుగుతున్నాయంటూ వస్తున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో రౌత్ పై వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బిహార్ ఎన్నికలు అభివృద్ధి, శాంతిభద్రతలు, సుపరిపాలన చుట్టూ తిరగాలి. కానీ అవి లేకపోతే.. ముంబై నుంచి సమస్యలను పార్శిల్ చేస్తాం’’ అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. బిహార్ లో పోటీపై అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని, వారిదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. బిహార్ లో కేవలం కులంతో పాటు మరికొన్ని అంశాల చుట్టే తిరుగుతాయని, కార్మిక చట్టాలు, కార్మికుల చుట్టూ తిరగవని రౌత్ విమర్శించారు. బిహార్‌కు చెందిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటూ లబ్ధి పొందాలని భావిస్తున్నారంటూ ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక బిహార్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందన్నారు సంజయ్‌. దీని గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించి.. రెండు-మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక బిహార్‌ ఎన్నికలు కూలం, ఇతర విషయాల మీద జరుగుతాయి. కార్మిక చట్టాలు, రైతులకు సంబంధించిన సమస్యలను వీరు పట్టించుకోరు అంటూ సంజయ్ రౌత్‌ గ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.