సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే దివాకర్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టిఆర్ఎస్ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఇరిగేషన్ పద్దులపై దివాకర్ రావు మాట్లాడారు. గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదన్నారు.
తెలుగుదేశం హయాంలో పదేళ్లలో రూ. 10 వేల కోట్లు, కాంగ్రెస్ హయాంలో రూ. 55 వేల కోట్లు ఖర్చు పెడితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నరేండ్లలో రూ. లక్షా 55 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 24 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే.. ఇప్పుడు అది 64 లక్షల టన్నులకు చేరిందని దివాకర్ రావు అన్నారు.