సీతాఫలం.. ఖనిజాలు పుష్కలం

ఈ సీజన్‌లో దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. చలికాలం మూడు నెలల్లో ఈ పండు బాగా దొరుకుతుంది. దీనిలో ఉండే పోషకాలు, సి విటమిన్లు శీతాకాలంలో వచ్చే వ్యాధులను దరిచేరనివ్వవు. అందుకే దీన్ని అనారోగ్యాల నివారిణిగా పిలుస్తారు. ఈ పండును గర్భిణీ స్త్రీలు తింటే కడుపులో పెరుగుతున్న పిల్లల మెదడు కు బలం చేకూరుస్తుంది. సీతాఫలం గుజ్జు లో పాలు చక్కెర కలిపి త్రాగితే మంచి శక్తినిస్తుంది పచ్చి సీతాఫలంలో కొబ్బరి నూనె కలిపి తైలం గా కాచి చల్లార్చి తలకు రుద్దితే చుండ్రు తగ్గిపోతుంది. పేలు కూడా రాలి పడిపోతాయి. ఈ తైలం రాస్తే సోరియాసిస్ కూడా తగ్గి పోతుంది. సీతాఫలం ఆకు ను దంచి ముద్దగా చేసి సెగ గడ్డల పై కట్టుగా కడితే తగ్గిపోతాయి సీతాఫలం గింజలను మెత్తగా దంచి మేక పాలతో కలిపి బట్ట తల పై రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి. పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు సీతాఫలం ఆకు ను ముద్దగా చేసి నొప్పి పై అదిమి పెట్టుకోవాలి. పంటి నొప్పి తగ్గిపోతుంది పంటి నొప్పి తగ్గిపోతుంది. సీతాఫలం పచ్చికాయ గింజల రసాన్ని తీసి పంటలపై క్రిమిసంహారిణిగా వాడుతారు.
- సీతాఫలంలో ఉండే విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు.
- దీనిలో బి6 విటమిన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి గురికాకుండా, మెదడును చురుకుగా ఉంచుతుంది.
- ఐరన్ అధికంగా ఉండి అనీమియా వ్యాధి రాకుండా చూస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
- సీతాఫలంలో బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్ వంటి క్యాన్సర్ నిరోధక కారకాలు పుష్కలంగా ఉన్నాయి.
- పొటాషియం, మెగ్నీషియం ఖనిజాలు ఉండి దంతాల నొప్పిని నివారించి, వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలంలో ఉంది.
- ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. బరువు పెరగకుండా చూస్తుంది. గుండెకు మంచిది.
- సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు కూడా తగిన మోతాదులో సీతాఫలాన్ని తినవచ్చు.
-పూర్ణిమ
Wow, superb weblog layout! How long have you been running a blog for? you make blogging glance easy. The whole look of your web site is magnificent, let alone the content!!