సేక‌రించిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా: కేంద్రం

న్యూఢిల్లీ (CLiC2NEWS): సేక‌రించిన క‌రోనా వ్యాక్సిన్ల‌ను అన్ని రాష్ట్రాల‌కు ఉచితంగానే ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్రం వ్యాక్సిన్లపై స్పష్టతనిచ్చింది.
“దేశంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్‌ల‌ను రూ.150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేక‌రించిన వ్యాక్సిన్ల‌ను రాష్ట్రాల‌కు ఉచితంగా అందిస్తున్నాం. ఇక‌పై కూడా అది కొన‌సాగుతుంది.“ అని కేంద్ర ఆరోగ్య శాఖ నేడు ట్వీట్ చేసింది.

ఇటీవల ఓ టీకా తయారీ సంస్థ కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.600కు సరఫరా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై దేశవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సామాన్యులకు అందుబాటులో ఉండకుండా, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేలా ధరలను నిర్ణయించటాన్ని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. వన్ నేషన్.. వన్ ట్యాక్స్ విధానాన్ని అందరూ అంగీకరించినప్పుడు.. ఇలా ధరలను వ్యత్యాసంలో ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.