`స్థానిక` ఎన్నికలపై 29న తుది నిర్ణయం : హైకోర్టు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తరుఫు నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని, కరోనా పరిస్థితులపై ఎస్‌ఇసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అధికారుల బృందం ఎస్‌ఇసితో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈ నెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల బృందం ఎస్‌ఇసితో చర్చించనుంది.