హుజూరాబాద్ లో ఈట‌ల ప‌ర్య‌ట‌న‌..

హుజూరాబాద్ (CLiC2NEWS): కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ పర్యటిస్తున్నారు. శుంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్‌, శంభునిపల్లి, కానిపర్తిలో రోడ్‌ షోగా వెళ్తుండగా.. అనుచరులు భారీగా చేరుకున్నారు. పలు గ్రామాల్లో మహిళలు హారతులు పడుతున్నారు. ఈటల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

ఈ సంద‌ర్భంగా ఈట‌ల మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక‌లో ధ‌ర్మానికి, అధ‌ర్మానికి మ‌ధ్య యుద్ధం జ‌ర‌గ‌నుంద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మానికి క‌రీంన‌గ‌ర్ కేంద్ర‌బిందువ‌ని.. ఆనాడు సింహ‌గ‌ర్జ‌న‌కు క‌రీంన‌గ‌ర్ ఎలా తొలిప‌లుకు ప‌లికిందో.. నేడు హుజూరాబాద్ కూడా ఆత్మ‌గౌర‌వ పోరాటానికి ఉద్య‌మ క్షే్త్రంగా మార‌నుంద‌ని చెప్పారు. హుజూరాబాద్ నుంచే మ‌రో ఉద్య‌మానికి నాందిప‌లుకుతామ‌ని ఈట‌ల చెప్పారు. అక్ర‌మ సంపాద‌న‌తో హుజూరాబాద్‌లో ఓట‌ర్ల‌ను కొనుగోలు చేయ‌డానికి య‌త్నిస్తున్నాని ఈట‌ల ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.