హైదరాబాద్లో దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్: తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 35 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. రైతులకు తక్షణ సాయం కింద 10వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతికి అంది వచ్చే సమయంలో పంట వరదలో మునగడంపై పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించిన సమయంలో… వారికి పరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ కూడా చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో తాజాగా.. నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు.
హైదరాబాద్ లోని తన నివాసం దగ్గరే ఆయన దీక్షలో కూర్చున్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్ష ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది. అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, బీజేపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు.