హోలీ రోజు వైన్‌షాపులు బంద్

హైదరాబాద్ : హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 28 సాయింత్రం ఆరు గంటల నుంచి మార్చి 30 సాయింత్రం ఆరు గంటల వరకు హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.