హర్యానాలో 8-12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా టాబ్స్

చండీగఢ్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు టాబ్స్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఉచితంగా టాబ్స్ పంపిణీ చేసే ప్రక్రియను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో 9 నెలలకుపైగా మూసివేసిన స్కూళ్లను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. అయితే స్టడీ మెటీరియల్, పాఠ్యపుస్తకాలను ప్రీలోడ్ చేసిన సుమారు 8.20 లక్షల టాబ్స్‌ను తదుపరి విద్యా సెషన్ ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు అందజేస్తామని వెల్లడించింది.తరగతి గదిలో లేదా ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను నేర్చుకోవడానికి స్టూడెంట్స్‌కు ఇవి సహాయపడతాయని రాష్ట్ర సర్కార్ పేర్కొంది.