AP: చిత్రావ‌తి న‌దిలో చిక్కుకున్న 10 మంది సుర‌క్షితం

అమ‌రావ‌తి(CLiC2NEWS): ఆంధ్రప్ర‌దేశ్‌లో కురుస్తున్నా భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు జిల్లాలు నీట మునిగాయి. నదుల‌న్నీ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.  చిత్రావ‌తి న‌దిలో ఈరోజు ఉద‌యం కారు కొట్టుకు పోయింది. అనంత‌పురం జిల్లాలో చెన్నే కొత్త‌ప‌ల్లి మండ‌లం వెల్తుర్ది గ్ర‌మం వ‌ద్ద ప్ర‌వ‌హించే చిత్రావ‌తి న‌దిలో కారు కొట్టుకు పోయింది.
వారిని ర‌క్షించేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది వెళ్లారు. అంద‌రూ క‌ల‌సి మొత్తం 10 మంది చిత్రావ‌తి న‌దిలో జెసిబిపై ఉండిపోయారు. జిల్లా యంత్రాంగం వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఎపి సిఎం స‌త్వ‌రం స్పందించారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ తో రిస్క్యూ సిబ్బంది న‌దిలో చిక్కుకున్న 10 మందిని రక్షించారు. వైస్సార్ క‌డ‌ప జిల్ల‌లో రాజంపేట వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది. ప్ర‌యాణికులు బస్సు మీద‌కు ఎక్కి ప్రా‌ణాలు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. చెయ్యేరు న‌దిలో 15 మంది క‌నిపించ‌కుండా పోయారు.

 

Leave A Reply

Your email address will not be published.