ఖమ్మం వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేలు

ఖమ్మం (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వెంట మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగే్శ్వరరావు, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపి రఘురాం రెడ్డి తదితరులు ఉన్నారు. ఖమ్మంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలు పరిశీలించిన సిఎం వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందజేయాలని కలెక్టర్‌న ఆదేశించారు. కాలనీలో ఉన్న ఇళ్లు మొత్తం నీటమునిగాయి. ఇంటిలో ఉన్న సామాగ్రి మొత్తం తడిసిపోయాయని, పిల్లల సర్టిఫికెట్లు సైతం నానిపోయాయంటూ పలువురు వాపోయారు. ఈ సందర్బంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారికి కొత్తవి ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు.
వరదల కారణంగా ఇప్పటి వరకు రూ. 5వేల కోట్లు నష్టం జరిగినట్లు సిఎం తెలిపారు. ఊహ తెలిసినప్పటి నుండి ఇంతటి వరద చూడలేదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం ప్రాణాలు పెట్టి శ్రమించాన్నారు. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లు అందుబాటులోకి రాలేదన్నారు. సిఎం తాత్కాలిక నష్ట పరిహారం ప్రకటించారని.. నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకుంటామన్నారు.