100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసిన సింగర్ స్మిత

హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కాలంలో సాయం చేయడానికి పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించి సాయం చేసింది. పలు కోవిడ్ సెంటర్లలో మొత్తంగా 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు స్మిత స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేసింది. తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడించింది. ఆక్సిజన్ పడకల ఏర్పాటుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటులో సహాయం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
Ever grateful to my team 🙏🏼 they hv never let me down. Without thinking abt how challenging it would be, I end up taking responsibilities small & big whenever I c a need. If nt fr them, all my dreams would hv just remained dreams. Turning our 100 bed oxygen support to reality 💪🏼 pic.twitter.com/uh4xgvtZPC
— Smita (@smitapop) May 23, 2021