100 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసిన సింగర్ స్మిత

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కాలంలో సాయం చేయ‌డానికి ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పాప్​ సింగర్​ స్మిత ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించి సాయం చేసింది. పలు కోవిడ్​ సెంటర్లలో మొత్తంగా 100 ఆక్సిజన్​ పడకలను ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు స్మిత స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. తాను అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్లు వెల్ల‌డించింది. ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల ఏర్పాటుకు సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆక్సిజ‌న్ బెడ్ల ఏర్పాటులో స‌హాయం చేసిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.