ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రుసుము చెల్లింపు తేదీలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు చెల్లించేందుకు తేదీలను ప్ర‌క‌టించారు. ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా న‌వంబ‌ర్ 18 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చు. ఈ మేర‌కు ప‌రీక్షల విభాగం సంచాల‌కులు వెల్ల‌డించారు. రూ.50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు చెల్లించే అవ‌కాశం ఉంది. రూ. 200 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు , రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 21 వ‌ర‌క చెల్లించుకోవ‌చ్చ‌ని సంచాల‌కులు ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.