సిఐఎస్ఎఫ్ లో 1130 కానిస్టేబుల్ పోస్టులు

CISF: కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ ఆధ్వర్యంలోని సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటి ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) 1130 కానిస్టేబుల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న యూనిట్ల‌కు ర‌క్ష‌ణ నిమిత్తం కానిస్టేబుల్‌/ ఫైర్ ( మేల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 32, తెలంగాణ‌లో 26 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు/ యూనివ‌ర్సిటి నుండి సైన్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు అర్హులు . అభ్య‌ర్థుల వ‌య‌స్సు సెప్టెంబ‌ర్ 30 నాటికి 18 నుండి 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అంటే 01-10-2001 నుండి 30-09-2006 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు. ఎస్‌టి, ఎస్‌సి ల‌కు ఐదేళ్లు ఇఎస్ ఎం/ ఒబిసిల‌కు మూడేళ్ల స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. ఎంపికైన అభ్య‌ర్థ‌లకు నెల‌కు రూ. 21,700 నుండి రూ. 69,100 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 30లోపు పంపించాలి. ద‌ర‌ఖాస్తు రుసుం రూ.100 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఇఎస్ఎంల‌కు ఫీజు లేదు. ఫిజిక‌ల్ స్టాండ‌ర్స్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ , రాత పరీక్ష , మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌తో అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల ఎత్తు క‌నీసం 170 సెం.మీ, ఛాతీ 80-85 సెం.మీ ఉండాలి . పూర్తి వివ‌రాల‌కు https://cisfrectt.cisf.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.