డిసెంబరు నాటికి అందుబాటులోకి 135 కోట్ల కొవిడ్ టీకాలు..!

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా కట్టడికోసం దేశంలో వ్యాక్సినేషన్ జోరు కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల పంపిణీలో వేగం పెంచాయి. వ్యాక్సినేషన్‌లో భాగంగా టీకాల ఉత్పత్తి లో కూడా శరవేగంగా కొనసాగుతున్నది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య వ్యవధిలో మరో 135 కోట్ల టీకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర సర్కార్ ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
ఈ ఐదు నెలల వ్యవధిలో..
- కొవిషీల్డ్ డోసులు 50 కోట్లు
- కొవాక్సిన్ డోసులు 40 కోట్లు
- బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్లు
- జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ డోసులు 5 కోట్లు
- స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు 10 కోట్లు
పైన పేర్కొన్న డోసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్రం సుప్రీకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో వివరించింది.