జలమండలికి కొత్తగా 141 మంది జూనియర్ అసిస్టెంట్లు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలికి కొత్తగా 141 మంది జూనియర్ అసిస్టెంట్స్ (పీ అండ్ ఏ, ఎఫ్ అండ్ ఏ) వచ్చారు. వీరంతా గ్రూప్-4 పరీక్షల్లో ఉద్యోగం సాధించారు. వీరికి సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ 141 మందిని ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. నేటి నుంచి రెండు రోజుల పాటు వీరందరికి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గచ్చిబౌలిలో శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఎండి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మీరంతా ఎలాగైతే కష్టపడ్డారో అదేవిధంగా నిజాయితీగా కష్టపడి జలమండలికి మంచి పేరు తేవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ఈస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు, సీజీఎంలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రభు, పద్మజ తదితరులు పాల్గొన్నారు.