రాష్ట్రంలో 15 కొత్త‌ ఫైర్ స్టేష‌న్ల ఏర్పాటుకు ఉత్త‌ర్వులు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కొత్త‌గా 15 ఫైర్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోదించింది. వీటి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి 382 ఉద్యోగాల‌ను కూడా మంజూరు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫైర్ స్టేష‌న్ లేని శాస‌న‌స‌భ నియోజ‌క‌వర్గాల్లో వీటిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. మంజూరు చేసిన ఉద్యోగాల‌లో 367 పోస్టుల‌కు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌, 15 పోస్టుల‌ను అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో తీసుకోకున్నారు.

Leave A Reply

Your email address will not be published.