విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి 15మంది మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/students-bus-accident.jpg)
ఇంఫాల్ (CLiC2NEWS): విద్యార్థులతో విజ్ఞానయాత్రకు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురై 15 మంది మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మణిపూర్ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో చోటుచేసుకుంది.
నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్ విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్తన్న విద్యార్థుల బస్సు బోల్తాపడి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. విద్యార్థులంతా రెండు బస్సులలో స్టడీ టూర్కు వెళ్లారు. మార్గమధ్యలో అమ్మాయిలు ప్రమాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సిఎం బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.