సిక్కింలో ఘోర ప్రమాదం.. 16 మంది జవాన్లు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/soldiers-dead-in-road-accident-at-sikkim.jpg)
గ్యాంగ్‌టక్ (CLiC2NEWS): సిక్కింలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు మరణించారు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో శుక్రవారం ఈ దుర్ఘటన సంభవించింది. జవాన్లు మూడు వాహనాలతో ఛట్టెన్ నుండి థంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్ట్‌లకు వెళ్తుండగా.. ఓ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు ఉండగా.. 16 మంది మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థాలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.